![]() |
![]() |
.webp)
అక్కినేని నాగార్జున(Nagarjuna)కెరీర్ ని మలుపు తిప్పిన మూవీ శివ(Siva)ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు చిన్న.ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటుడు గా నటించి తన సత్తా చాటిన చిన్నకొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేసాడు.
రీసెంట్ గా చిన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 'నేదురుమల్లి జనార్ధన రెడ్డి'(Nedurumalli Janardhana reddy)కి సొంత మేనల్లుడిని అని ఎవరకి చెప్పుకోలేదు.నేను ఆర్టిస్ట్ ని అయ్యాక క్యాబినెట్ అందరితో 'చిన్న' నా మేనల్లుడు అని మా మావయ్య గర్వంగా చెప్పుకున్నాడు.ఒక్కసారి మాత్రం దాసరి నారాయణరావు(Dasarai Narayanarao)గారికి ఫోన్ చేసి చిన్న నా మేనల్లుడేరా ఏమైనా చూడరా అని చెప్పాడు.ఇండస్ట్రీలో రికమండేషన్ మీద ఏది జరగదు.రికమండేషన్ మీద జరిగేది పాయింట్ పర్సెంట్ మాత్రమే. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్కు.రెండోది టాలెంట్ మూడోది డిసిప్లేన్.అందులో 'లక్కు' అనేది ఏంటంటే సక్సెస్.మనం నటించిన సినిమా సక్సెస్ అవ్వాలి.అందులో మన క్యారక్టర్ కి పేరు రావాలి.ఇవన్నీ కూడా లక్ మీద ఆధారపడి ఉంటాయి.ఇండస్ట్రీ లో మనకి వచ్చిన అవకాశాన్నే వాడుకొని,ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి.
ఇది ఒక మహాసముద్రం.ఇక్కడ రకరకాల ప్రవర్తనలకి చెందిన మనుషులు ఉంటారు.అలాంటి ఈ సముద్రంలో ఈదటం అనేది అంత ఈజీ కాదు.ఇంకా ఈదుతూనే ఉన్నాను.ప్రేక్షకులో వచ్చినంత గుర్తింపు నాకు ఇండస్ట్రీలో రాలేదు.కాకపోతే చిరంజీవి(Chiranjeevi)గారి ఇనిస్ప్రెషన్ తో ఇండస్ట్రీ కి వచ్చి,ఆయనతో ఒక్క సినిమాలో అయినా చెయ్యాలని అనుకున్నాను.ఆ కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చాడు.

![]() |
![]() |