![]() |
![]() |

కమల్ హాసన్(kamal Haasan)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి హాసన్(Shruthi Haasan)అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.శృతి ఒక సినిమాలో ఉందంటే ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే నానుడి కూడా సినీ ఇండస్ట్రీలో ఉంది.ఆమె నటించిన చిత్రాలే అందుకు ఉదాహరణ.2023 లో వాల్తేరు వీరయ్య, వీర సింహరెడ్డి, సలార్ వంటి భారీ హిట్లని తన ఖాతాలో వేసుకున్న శృతి 2024 లో మాత్రం సిల్వర్ స్క్రీన్ పై సందడి చెయ్యలేదు.
ఇక ఇప్పుడు శృతి హాసన్ ఖాతాలో రజనీకాంత్(Rajini Kanth)అప్ కమింగ్ మూవీ 'కూలీ'తో పాటు విజయ్ సేతుపతి'ట్రైన్' మూవీలు ఉన్నాయి.ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో శృతి నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఇళయ దళపతి 'విజయ్'హీరోగా 'జన నాయగాన్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిలర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి ఒక కీలకమైన క్యారెక్టర్ చెయ్యబోతుందని,ఈ మేరకు చిత్ర బృందం శృతితో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది.ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
విజయ్ తో కలిసి శృతి హాసన్ 2015 లో 'పులి' అనే సినిమాలో కలిసి నటించింది.ఇప్పుడు పదేళ్ల తర్వాత తిరిగి విజయ్(vijay)తో కలిసి చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో క్యూరియాసిటీ నెలకొని ఉంది.పూజహెగ్డే ఆల్రెడీ ఇందులో హీరోయిన్ గా చేస్తుండంతో,శృతి మరో హీరోయిన్ గా చేస్తుందా,లేక స్పెషల్ క్యారక్టర్ ఏమైనా చేస్తుందా అనేది కూడా మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్నఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకుడు.
.webp)
![]() |
![]() |