![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)పవన్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో 'వీరమల్లు' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన పోస్టర్స్,వీడియో గ్లింప్స్ పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండటంతో మూవీ రిలీజ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక కొన్ని రోజుల క్రితం 'వీరమల్లు' నుంచి 'మాట వినాలి' అనే లిరిక్ తో కూడిన సాంగ్ ఒకటి రిలీజయ్యింది.'ఆ సాంగ్ ని స్వయంగా పవన్ ఆలపించగా, సాంగ్ మాత్రంప్రేక్షకులని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా,మ్యూజిక్ చార్ బస్టర్ గా కూడా నిలిచింది.కానీ ఈ పాటని తొలుత ప్రముఖ సింగర్,లిరిక్ రైటర్ అయినటువంటి పెంచల్ దాస్(Penchal Das)పాడాలని అనుకున్నాడట.కానీ పవన్ కళ్యాణ్‌కు ఈ పాట నచ్చడంతో పవనే పాడతానని చెప్పాడంట.ఈ విషయాన్నీ పెంచల్ దాస్ నే చెప్పాడు.ఇక పెంచల్ దాస్ సింగర్ గా కృషార్జున యుద్ధం,అరవింద్ సమెత వీర రాఘవ,శ్రీకారం వంటి చిత్రాల్లో పాటలు పాడటంతో పాటు ఎన్నో అద్భుతమైన పాటలు కూడా రాసారు.ఇప్పుడు విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'లైలా'లో కూడా సింగర్, లిరిక్ రైటర్ గా తన సత్తా చాటనున్నాడు.
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి(keeravani)సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న'హరిహర వీరమల్లు'ని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా,జ్యోతి కృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహిస్తున్నాడు.ఈయన దర్శకత్వంలో గతంలో గోపిచంద్(Gopi Chandh)నటించిన 'ఆక్సిజన్' తో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన రూల్స్ రంజన్ తో పాటు పలు తమిళ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.నిధి అగర్వాల్(Nidi Agarwal)హీరోయిన్ కాగా,బాబిడియోల్ విలన్ గా చేస్తున్నాడు.

![]() |
![]() |