![]() |
![]() |

'విశ్వక్ సేన్' అప్ కమింగ్ మూవీ'లైలా'(Laila).వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14 న విడుదలవుతున్న ఈ మూవీలో 'విశ్వక్ సేన్'(Vishwak Sen)టైటిల్ రోల్ లో లేడీ గెటప్ ని పోషించాడు.దీంతో 'లైలా' పట్ల విశ్వక్ సేన్ అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొని ఉంది.ఇక ఈ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరగగా, మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యి విశ్వక్ ని ఆశీర్వదించడంతో 'లైలా'కి అదనపు క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఈ మూవీలో 'థర్టీ ఇయర్స్ పృథ్వీ'(Prudhvi)మేకల సత్తి అనే ఒక స్పెషల్ క్యారక్టర్ ని పోషించాడు.ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో,తన క్యారక్టర్ గురించి మాట్లాడుతు విలన్ నన్ను తీసుకురమ్మంటే వాళ్ళ మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్తారు.అప్పుడు నా దగ్గర ఉన్న మేకల్ని లెక్కపెడితే,కరెక్ట్ గా 150 మేకలు ఉంటాయి.ఆ తర్వాత చివరికి నన్ను రిలీజ్ చేసేటప్పుడు లెక్కపెడితే మాత్రం పదకొండు మేకలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
పృథ్వీ ,డైరెక్ట్ గా వైసిపీ పేరు చెప్పకపోయినా కూడా,గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసిపీ పార్టీని ఉద్దెశించే ఆ వ్యాఖ్యలు చేసాడని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇటీవల హాజరయిన చాలా సినిమాల ఈవెంట్స్ లో పృథ్వీ 150 ,11 నంబర్స్ ని ప్రస్తావిస్తునే ఉన్నాడని,సినిమా ఫంక్షన్స్ లో పొలిటికల్ విషయాలు తీసుకురాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లో జరిగిన 2019 ఎన్నికల్లో వైసీపీ కి 151 ,ఆ తర్వాత 2024 ఎన్నికల్లో 11 వచ్చాయనే విషయాన్నీ కూడా గుర్తు చేస్తున్నారు.ఇక 'లైలా' మూవీని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి(Saahu Gaarapati)నిర్మించగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా చేస్తుంది.రామ్ నారాయణ్(Ram Narayan)దర్శకుడు.

![]() |
![]() |