![]() |
![]() |

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడు ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కలయికలో నాలుగో సినిమాగా 'అఖండ-2' రాబోతుంది. (Akhanda 2 Thaandavam)
బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న 'అఖండ 2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.
గతంలో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన 'సరైనోడు' చిత్రంలోనూ ఆది విలన్ గా నటించాడు. ఆ సినిమాలో ఆది నటనకు ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మూవీ. దానికి తోడు, ఆది కూడా తోడైతే అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలకృష్ణ, ఆది పోటాపోటీ నటన ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'అఖండ-2'కి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ని శివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
![]() |
![]() |