![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో 'ఓజి'(og)కూడా ఒకటి.పవన్ ఫ్యాన్స్ లో మాత్రం ఈ మూవీకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.ఇందుకు నిదర్శనంగా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లినా కూడా,ఆ సందర్భం ఏంటనేది కూడా చూడకుండా ఫ్యాన్స్ మాత్రం 'ఓజి' అని అరవడం కామన్ అయిపోయింది.అంతటి క్రేజ్ ని సంపాదించిన ఈ మూవీని 'ఆర్ఆర్ ఆర్' నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా,ప్రభాస్ తో సాహో వంటి పాన్ ఇండియా మూవీని తెరకెక్కించిన సుజిత్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ మూవీకి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
రీసెంట్ గా థమన్(Thaman)ఒక ఇంటర్వ్యూ లో 'ఓజి' మ్యూజిక్ విషయంలో మాట్లాడుతు 'ఓజి' మ్యూజిక్ పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.ఈ మ్యూజిక్ రిలీజ్ అయ్యేసరికి నేను గడ్డాలు,మీసాలు పెంచుకుంటాను.మ్యూజిక్ రిలీజ్ తర్వాత మీసం కూడా మెలేస్తాను.ఈ మూవీ కోసం సుజిత్ అండ్ టీమ్ ఎంతో కష్టపడుతున్నారు.దీని ఔట్‌పుట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు థమన్ మాట్లాడిన ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ పట్ల మూవీపై అంచనాలని మరింతగా పెంచాయని చెప్పవచ్చు.

ప్రియాంక మోహన్ (Priyanka mohan) హీరోయిన్‌గా చేస్తున్న 'ఓజి'లో సలార్ (Salaar) ఫేమ్ శ్రీయరెడ్డి,ఇమ్రాన్ హష్మీ,అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్,వంటి మేటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.
![]() |
![]() |