![]() |
![]() |
.webp)
స్టార్ రైటర్ 'పరుచూరి గోపాల కృష్ణ'(Paruchuri Gopalakrishna)తెలుగు చిత్ర సీమలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తన సోదరుడు పరుచూరి గోపాల కృష్ణ తో కలిసి పరుచూరి బ్రదర్స్ అనే పేరుతో ఎన్నో హిట్ చిత్రాలకి కథ,మాటలు,స్క్రీన్ ప్లే అందించాడు.హీరోలు,దర్శకులకి ఉన్నట్టే పరుచూరి బ్రదర్స్ రచనలకి కూడా ఫ్యాన్ బేస్ ఉందంటే.వాళ్ళ యొక్క రచనా ప్రతిభని అర్ధం చేసుకోవచ్చు.
పరుచూరి గోపాల కృష్ణ కొంత కాలం నుంచి 'పరుచూరి పలుకులు'పేరుతో పలు కొత్త,పాత సినిమాలకి సంబంధించిన వివిధ అంశాలపై విశ్లేషణలని అందిస్తున్న విషయం చాలా మంది సినీ ప్రేమికులకి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్(Allu Arjun)వన్ మాన్ షో పుష్ప 2 గురించి మాట్లాడుతు 'నేను పుష్ప 2(Pushpa 2)చూసిన తర్వాత సుకుమార్(Sukumar)కి ఫోన్ చేస్తే సినిమా ఎలా ఉందని అడిగాడు. దాంతో నేను సుకుమార్ తో మూవీని నువ్వు,అల్లు అర్జున్ చెరో ఒక వైపు ఉండి హిట్ చేసారు.కాకపోతే ఫంక్షన్లో షెకావత్ కి పుష్ప సారీ చెప్పే విషయంలో నేను బోల్తా పడ్డాను.క్షమాపణ చెప్పకుండా అక్కడ వేరేది ప్లాన్ చేస్తారేమో అనుకున్నాను.ఎందుకంటే హీరో ఓడిపోయేలా క్యారెక్టర్స్ ని డైరెక్టర్ డిజైన్ చెయ్యడు.
కానీ పుష్ప మూవీలో ప్రతినాయకుడైన హీరో.ధర్మం చేసే వాడు అయితే క్షమాపణలు చెప్తే ప్రేక్షకులు తట్టుకోలేరు.కాకపోతే ఇక్కడ హీరో స్మగ్లర్ కాబట్టి తట్టుకోగలిగారని చెప్పుకొచ్చాడు.పరుచూరి గోపాల కృష్ణ నటుడిగాను గతంలో కొన్ని సినిమాల్లో ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు.ఆయన డైలాగ్ డెలివరీ కి కూడా అప్పట్లో ఒక క్రేజ్ ఉంది.

![]() |
![]() |