![]() |
![]() |

తెలుగు సినిమాకి సంబంధించిన ఎలాంటి అంశం మీద నైనా మాట్లాడే అధికారంతో పాటు నిర్ణయాలు తీసుకునే అధికారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber Of Commerce)కి ఉంది 1979 లో ఏర్పడిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు సినిమా పుట్టినప్పట్నుంచి,ఎన్నో నిర్ణయాలని ఎలాంటి పక్ష పాతం లేకుండా తీసుకొని తెలుగు సినిమా ఔనత్యాన్ని కాపాడుతు వస్తుంది.చలనచిత్ర పరిశ్రమకి చెందిన,వివిధ సమస్యలని,రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు కూడా తెలియచేస్తుంటుంది.
ఇంతటి గొప్ప పేరు గల'తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్'ఇప్పుడు ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనపర్చిన సినిమాలతో పాటు,నటీనటులకి అవార్డుల్నిఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది.తెలుగు సినిమా పుట్టినరోజైన ఫిబ్రవరి 6 న ఆ అవార్డుల్ని ప్రధానం చెయ్యాలని తీర్మానం చేసింది.పైగా ఆ రోజున ప్రతి నటుడి ఇంటిపైతో పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ లపైన తెలుగు సినిమాకి సంబంధించిన జెండా కూడా ఎగురవేయాలని నిర్ణయం తీసుకోగా, ఈ మేరకు జెండా రూపకల్పన చేసే బాధ్యతని స్టార్ రైటర్ 'పరుచూరి గోపాలకృష్ణ'(Paruchuri Gopalakrishna)కి ఛాంబర్ అప్పగించింది.తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం హైదరాబాద్ లోని ఫిలింనగర్ ప్రాంతంలో ఉంది.
![]() |
![]() |