![]() |
![]() |
.webp)
ఎనర్జిటిక్ స్టార్ 'రామ్ పోతినేని'(Ram Potineni)గత ఏడాది 'డబుల్ ఇస్మార్ట్'(Double Ismart)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఎన్నో అంచనాల మధ్య 'ఇస్మార్ట్ శంకర్'(Ismart SHankar)కి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ భారీ డిజాస్టర్ ని అందుకొని,రామ్ అభిమానులని,ప్రేక్షకులని నిరాశపరిచింది.దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని,తనకి అచ్చొచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ తో కూడిన సినిమాలో చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ మూవీలో ఒక అగ్ర హీరో నటించబోతున్నాడు.ఇందుకు గాను తెలుగుతో పాటు తమిళ,మలయాళ,భాషలకి చెందిన కొంత మంది హీరోల పేర్లని చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది.దీంతో ఏ హీరో ఈ ప్రాజెక్టు లో భాగస్వామ్యమవుతాడు,ఆ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది.హీరో ఎంపిక పూర్తయ్యాక ఈ విషయంపై అధికార ప్రకటన రానుంది.ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీలో మిస్టర్ బచ్చన్' ఫేమ్ 'భాగ్యశ్రీ బోర్సే'(Bhaghyashri Borse)హీరోయిన్ గా చేస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఒక లెవల్లో ఉండటంతో,రామ్ అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీ పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు.పి(Mahesh babu.p)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.ప్రస్తుతం హైదరాబాద్ లోనే పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుండగా,చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి కి తరలి వెళ్లనుంది.అక్కడే ఒక నెలరోజుల పాటు ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

![]() |
![]() |