![]() |
![]() |
.webp)
'డిజెటిల్లు','టిల్లుస్క్వేర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకుల్లో స్టార్ డమ్ ని సంపాదించిన నటుడు 'సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)ప్రస్తుతం జాక్, కోహినూర్ ,తెలుసు కదా అనే మూవీలు చేస్తున్నాడు.అధికారకంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చిన ఈ మూడు సినిమాల గురించి ప్రస్తుతం ఎలాంటి అప్ డేట్ లేకపోయినా కూడా షూటింగ్స్ జరుపుంటున్నాయనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఇక సిద్దు జొన్నలగడ్డ చేసిన గత చిత్రాల్లో 'కృష్ణ అండ్ హిస్ లీల'(Krishna and His Leela)కూడా ఒకటి.లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగాశ్రద్ధశ్రీనాధ్,సీరత్ కపూర్,షాలిని హీరోయిన్లుగా చేసారు.'రానా దగ్గుబాటి(Rana Daggubati)సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్,వయాకం 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా, 'రవికాంత్ పేరెపు' దర్శకత్వాన్ని వహించాడు.కాకపోతే ఈ మూవీ థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి వేదికగా 2020 లో జూన్ 25 న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది.ఇప్పుడు ఈ మూవీ థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.కాకపోతే 'కృష్ణ అండ్ హిస్ లీల'అనే టైటిల్ కి బదులు 'ఇట్స్ కాంప్లికేటెడ్'అనే టైటిల్ తో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది.ఈ మేరకు రానాతో పాటు సిద్దు జొన్నలగడ్డ,రవికాంత్ లు ఒక వీడియో కూడా చేసి రిలీజ్ విషయాన్నీ తెలియచేసారు.ఆ వీడియోలోని మాటల ద్వారా థియేటర్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో స్టార్ట్ అవ్వబోతునట్టుగా తెలుస్తుంది.
జనరల్ గా ఈ మూవీ అయినా కూడా థియేటర్ నుంచి ఓటిటి లోకి అడుగుపెట్టడం జరుగుతుంది.అదే టైంలో థియేటర్లో ఘన విజయం సాధించిన సినిమా ఓటిటిలో కూడా ఘన విజయాన్ని అందుకుంటుంది.మరి ఇప్పుడు ఓటిటి నుంచి థియేటర్స్ లోకి అడుగు 'ఇట్స్ కాంప్లికేటెడ్'ఏ మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
.webp)
![]() |
![]() |