![]() |
![]() |
.webp)
మంచు విష్ణు(Manchu Vishnu)కెరీరి లోనే ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa).పరమేశ్వరుడి పరమ భక్తుడైన 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ఒక కీలక పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధిచిన ప్రభాస్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. 'రుద్ర' అనే దైవ రక్షకుడు గా ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు.నుదుటిన శివ నామాలు,ఒంటి మీద రుద్రాక్షలు,శివుడి లాగానే పొడవాటి జుట్టు,చేతిలో మహిమ గల దండంతో ఉన్న ప్రభాస్ లుక్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా పూనకాలు తెప్పిస్తుంది.అంతే కాకుండా ఈ ఒక్క లుక్ తో 'కన్నప్ప' పై అంచనాలు ఆకాశాన్నంటాయని కూడా చెప్పవచ్చు.ఏప్రిల్ 25 న విడుదల కానున్న ఈ మూవీ విష్ణు,మోహన్ బాబు తో పాటు భారతీయ సినీ పరిశ్రమకి చెందిన పలు బాషా నటులు కూడా నటించడం జరిగింది.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు కాగా మోహన్ బాబు,విష్ణు లు ఈ సినిమాని నిర్మించారు. స్టీఫెన్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |