![]() |
![]() |

విశ్వక్ సేన్(Vishwak Sen)హీరోగా గత ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'గామి'(Gaami)రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా తెరకెక్కిన ఈ మూవీ నటుడుగా విశ్వక్ సేన్ ని ఒక మెట్టు పైకి ఎక్కేలా చేసిందని చెప్పవచ్చు.బహుశా ఎప్పటికైనా తన ఎంటైర్ సినీ జీవితంలో విశ్వక్ బాగా కష్టపడి చేసిన సినిమా 'గామి'నే కావచ్చు.అంతలా ఈ మూవీ కోసం కష్టపడ్డాడు.ఓటిటి వేదికగా కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీలో చాందిని చౌదరి(Chandini Chowdary)కీలక పాత్రలో చెయ్యగా అభినయ,హారిక పెద్దాడ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఇపుడు ఈ మూవీ ఒక అరుదైన ఘనతని చోటు చేసుకుంది.ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డామ్ 2025 కి ఎంపిక అయ్యింది.నెదర్లాండ్స్ వేదికగా జనవరి 30 న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ లో 'గామి'ని ప్రదర్శించనున్నారు.ప్రపంచంలోని వివిధ భాషలకి చెందిన 400 చిత్రాల దాకా ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనుండగా,ఫిబ్రవరి 9 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది.ఇందులో విజేతగా నిలిచిన సినిమాకి టైగర్ అవార్డు,ఆడియెన్స్ అవార్డు,రాబి ముల్లర్ అవార్డ్ లాంటివి ఇవ్వడంతో పాటు నగదు బహుమతిని కూడా ఇస్తారు.
ఇక రోటర్ డామ్ 2025 కి ఎంపిక కావడంపై చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.'గామి' ని స్క్రీన్ మీదకి తీసుకు రావడం కోసం 24 క్రాఫ్ట్స్ తో చాలా కష్ట పడింది.హిమాలయాల్లో కూడా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కథ కానీ, స్క్రీన్ ప్లే గాని ఎవరి ఊహ కందని విధంగా ఉంటుంది.విద్యాధర్ కాగిత(Vidyadhar Kagita)దర్శకత్వం వహించగా కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్ల్యులాడ్, వి ఆర్ గ్లోబల్ మీడియా మరికొంత మందితో కలిసి 'గామి' ని నిర్మించాయి.
![]() |
![]() |