![]() |
![]() |
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో సేలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలుగా తన సేవలను అందిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది ప్రభుత్వం. బాలయ్యకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
‘బాల బాబాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. బాలబాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు సినిమా రంగానికి మీరు చేసిన అసమానమైన సేవలకు, మీ నిర్విరామ ప్రజాసేవకు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేసి నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్టీఆర్.
![]() |
![]() |