![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మ భూషణ్' (Padma Bhushan) వరించింది. గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బాలకృష్ణను పద్మభూషణ్ కు ఎంపిక చేసింది.
ఎన్టీఆర్ వారసుడిగా 'తాతమ్మకల' చిత్రంతో సినీ రంగప్రవేశం చేసిన బాలకృష్ణ, నటుడిగా ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు కథానాయకుడిగా 109 చిత్రాల్లో నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక ఇలా అన్ని రకాల చిత్రాలలో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలో బాలకృష్ణ సేవలను గుర్తించిన కేంద్రం ఆయనకు పద్మభూషణ్ ను ప్రకటించింది.
![]() |
![]() |