![]() |
![]() |

అగ్ర దర్శకుడుగా సుకుమార్(Sukumar)కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే.రీసెంట్ గా పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకొని ఇంకో మెట్టు పైకి ఎక్కాడని చెప్పవచ్చు.తన తదుపరి సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుంది.ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది.ఇక సుకుమార్ కూతురు పేరు సుకృతి వేణి.ఆమె ప్రధాన పాత్రలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన 'గాంధీ తాత చెట్టు'(Gnadhi tatha chettu)అనే సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సుకృతి వేణి(Sukriti Veni)వెండి తెరపై ఎలా చేసిందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.14 thదాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా కూడా సుకృతి అవార్డుని అందుకుంది.పైగా ఈ సినిమా కోసం రియల్ గా గుండు కొట్టించుకోవడంతో సుకృతి ఎలా నటించిందనే ఆసక్తి అందరిలో మొదలయ్యింది.

సుకుమార్ రైటింగ్స్, అండ్ పుష్ప 2 తో భారీ హిట్ ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సంయుక్తంగా గాంధీ తాత చెట్టుని నిర్మించడంతో కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.పద్మావతి మల్లాది(Padmavathi Malladi)దర్శకురాలు కాగా గోపి టాకీస్ మరో నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.
![]() |
![]() |