![]() |
![]() |

'ఎఫ్-2', 'ఎఫ్-3' తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'సంక్రాంతికి వస్తున్నాం'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైంది. ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ ను తీయడానికి మూవీ టీం సిద్ధమవుతోంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి సీక్వెల్ ను కన్ఫర్మ్ చేశాడు. (Sankranthiki Vasthunam Sequel)
హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే ట్రెండ్ కొన్నేళ్లుగా ఊపందుకుంది. ఈ ట్రెండ్ లో వెంకటేష్-రావిపూడి కాంబినేషన్ కూడా ఉంది. వీరి కలయికలో మొదటి సినిమాగా 'ఎఫ్-2' వచ్చింది. అందులోని క్యారెక్టర్స్ ని తీసుకొని కొత్త కథతో 'ఎఫ్-3' వచ్చింది. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ విషయంలో కూడా అదే జరగనుందని తెలుస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని క్యారెక్టర్స్ ని తీసుకొని, డిఫరెంట్ స్టోరీతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ కి 'మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని, వచ్చే సంక్రాంతికి ఇది విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |