![]() |
![]() |

ఎన్టీఆర్(ntr)రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్ 1 'చిత్రంలో సత్య అనే నెగిటివ్ క్యారక్టర్ లో అత్యద్భుతంగా రాణించిన నటుడు రాజీవ్ కనకాల(rajeev kanakala)ఆ తర్వాత ఆది,నాగ,అడవి రాముడు,చంటి గాడు,సై, ఏ ఫిలిం బై అరవింద్, అతడు,అశోక్,అతిధి,జనతా గారేజ్,సామజవరగమన,వీరసింహ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 100 సినిమాల దాకా వివిధ రకాల క్యారక్టర్ ని పోషించి,అశేష ప్రేక్షాభిమాన్ని పొందాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న రాబోతున్న చరణ్ అప్ కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్' లోను ఒక కీలక పాత్ర
ని పోషించాడు.
ఇక ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే 'సుమ అడ్డా'(suma adda)అనే ఎంటర్ టైన్ మెంట్ షో కి రాజీవ్ కనకాల రావడం జరిగింది.ఈ నెల 31 న 'దావత్' అనే టైటిల్ తో ఒక సరికొత్త ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ కాగా, రాజీవ్ కనకాల తల్లి తండ్రులైన దేవదాస్ కనకాల,లక్షి కనకాల విగ్రహాలని షో లో ఆవిష్కారించడం జరిగింది.దాంతో రాజీవ్ ఎమోషనల్ కి గురయ్యి వెక్కెక్కి ఏడవడం జరిగింది. తల్లి తండ్రులతో పాటు తోడబుట్టిన చెల్లిని కూడా పోగొట్టుకున్నానని రాజీవ్ చెప్పడం పలువుర్ని కంటతడిపెట్టిస్తుంది.ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది.
.webp)
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల(devadas kanakala)నటుడుగా చాలా సినిమాల్లో వివిధ రకాల పాత్రలని పోషించి మంచి పేరు సంపాదించాడు. డిఫరెంట్ మాడ్యులేషన్ కి పెట్టించి పేరైన ఆయన ఎన్నో అవార్డుల్ని సైతం అందుకున్నాడు.నటన మీద మక్కువతో యాక్టింగ్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేసి ఎంతో మందికి నటనలో ఓనమాలుని నేర్పాడు.మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ స్కూల్ కి చెందిన వ్యక్తే.
![]() |
![]() |