![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు 'ఓజి'(og)అని పెద్దఎత్తున అరవడం ఆనవాయితీ అయిపోయింది.ఈ తంతు చాలా రోజుల నుంచి జరుగుతునే ఉంది.లేటెస్ట్ గా పవన్ వైసిపీ వాళ్ళ దాడిలో గాయపడిన జవహర్ బాబు ని పరామర్శించడానికి కడప వెళ్ళినపుడు కూడా సేమ్ పరిస్థితి. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకొని 'ఓజి' అని అరవడం మొదలుపెట్టారు.దీంతో ఇదా సందర్భం అంటూ పవన్ అభిమానులపై తన అసహనాన్ని వ్యక్తం చెయ్యడం జరిగింది.'ఓజి' ని నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ దానయ్య కూడా ఆ విధంగా అరుస్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ని ఇబ్బంది పెట్టవద్దని ట్వీట్ కూడా చేసింది.
మరి ఈ విషయాలన్నిటిపై ఫ్యాన్స్ హార్ట్ అయ్యారని పవన్ అనుకున్నాడేమో గాని, లేటెస్ట్ గా పవన్ ఓజి గురించి మాట్లాడటం జరిగింది.ఆయన మాట్లాడుతు ఓజి 1980,90 సంవత్సరాల మధ్య జరిగే కథ.ఓజి అంటే అర్ధం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.అభిమానులు ఎక్కడికి వెళ్లినా ఓజి అని అరుస్తున్నారు.అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.అన్ని సినిమాలకి నేను డేట్స్ ఇచ్చాను.ఆయా సినిమా వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు.హరిహర వీరమల్లు ఇంకా ఎనిమిది రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. అన్ని సినిమాలు ఒక్కొక్క దానిని పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు.అల్లు అర్జున్ కేసు గురించి కూడా మాట్లాడుతు గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహించే పనిలో బిజీగా ఉన్నాడు.మరోపక్క 'హరిహరవీరమల్లు'(hari hara veera mallu)షూటింగ్ లోను పాల్గొంటున్నాడు.పవన్ నుంచి రాబోయే అప్ కమింగ్ మూవీ కూడా ఇదే. 2025 ఉగాది సందర్భంగా మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.దీని తర్వాతే 'ఓజి','ఉస్తాద్ భగత్ సింగ్' లు రిలీజ్ అవుతాయి.
![]() |
![]() |