![]() |
![]() |

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఉన్న విషయంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా,మూడు వారాల కండిషన్ బెయిల్ పై అల్లు అర్జున్ బయట ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ కేసులో మరోసారి హాజరు కావాలని అల్లు అర్జున్(allu arjun)కి చిక్కడపల్లి పోలీసులు నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది.దీంతో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి తన లాయర్ తో కలిసి హాజరు కావలసి ఉంది.మరి విచారణలో అల్లు అర్జున్ కి పోలీసులు ఏ ప్రశ్నలు వేస్తారు.అందుకు అల్లు అర్జున్ ఎలాంటి సమాదానాలు చెప్తాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.అసలు అల్లు అర్జున్ హాజరవుతాడా లేదా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఇండియా లెవల్లో కూడా అల్లు అర్జున్ కేసు మీద అందరు చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు.ఇక ఈ కేసులో మొదటి నుంచి కూడా నేషనల్ మీడియా అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా కథనాల్ని ప్రచురితం చేస్తున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |