![]() |
![]() |

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109 వ చిత్రం 'డాకు మహారాజ్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.రీసెంట్ గా 'డాకు మహారాజ్'నుంచి చిన్నపాటి టీజర్ కూడా రిలీజయ్యి అందరిలో అంచనాలని పెంచేసిందని కూడా చెప్పవచ్చు.
బాలయ్య రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ 'సంయుక్త మీనన్' తో కలిసి తూర్పు గోదావరి కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన వేగ జ్యువెలరీ ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తన నటవారసుడు మోక్షజ్ఞ సినిమా గురించి మాట్లాడుతూ నిన్న సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉంది. కానీ మోక్షజ్ణ కి జలుబు చెయ్యడం వలన చేయలేకపోయాం.మళ్ళీ మంచి రోజు చూసీ ప్రారంభిస్తాం అని చెప్పడం జరిగింది. దీంతో మోక్షజ్ఞ మూవీ మీద వస్తున్న పలు రూమర్స్ కి చెక్ పెట్టినట్లయ్యింది.
ఇక రిపోర్టర్స్ బాలయ్యతో యాడ్స్ కి దూరంగా ఉండే బాలయ్య ఇప్పుడు యాడ్స్ చేస్తున్నారు అని అడగగానే 'ఇందు గలడు అందు లేడు ఎందెందు వెతికిన అందెందు గలడయ్యా అని చెప్పినట్టు నేను అన్ని చోట్ల ఉంటాను.ఒకసారి అడుగుపెట్టానంటే దాని అంతు చూడకుండా ఉండను. దేంట్లో అయినా అన్ స్టాప్పబుల్. ఉహించంది చెయ్యడమే నా నైజం.ఆ ప్రోగ్రాం ద్వారా సినిమావాళ్ళకి, ప్రేక్షకులకి స్వాతంత్రం వొచ్చినట్టయింది అని చెప్పుకొచ్చాడు.ఇక మీడియా వాళ్ళు పదే పదే రాజకీయాలకి సంబంధించిన పలు అంశాల గురించి ప్రస్దావనకి తీసుకొస్తుండంతో మీరు ఎంత తీగ వెయ్యాలని చూసినా డొంక కదలదని, రాజకీయాల ప్రస్తావనని తీసుకురాకుండా తన ప్రసంగాన్ని కొనసాగించాడు.
![]() |
![]() |