![]() |
![]() |
.webp)
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం హాస్పిటల్ లో అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు.ఇంకో రెండు రోజులు అయితే గాని శ్రీ తేజ ఆరోగ్యం విషయంలో వివరణ ఇవ్వలేమని డాక్టర్స్ చెప్పడం జరిగింది.
ఇక జరిగిన ఆ దారుణమైన సంఘటనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(komati reddy venkat reddy)మాట్లాడుతు ఇకనుంచి తెలంగాణాలో బెనిఫిట్ షోలకి పర్మిషన్ లేదు.రేణుక మరణం ఎంతగానో కలిచి వేస్తుంది.ఆమె మరణంపై హీరో,చిత్ర యూనిట్ స్పందించకపోవడం చాలా బాధాకరం. మనిషి ప్రాణాన్ని వాళ్ళు తీసుకురాలేరు.వేలకోట్ల కలక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు కదా, బాధితులకు పాతిక లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కోమటి రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రేపు సంక్రాంతికి రాబోయే బాలకృష్ణ, రామ్ చరణ్ మూవీలకి సంబంధించిన బెనిఫిట్ షోస్ తెలంగాణాలో ప్రదర్శితమయ్యే అవకాశం లేనట్టే.
![]() |
![]() |