![]() |
![]() |
.webp)
రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు సుబ్బరాజు(subbaraju)ఒక ఇంటి వాడైన విషయం తెలిసిందే.తన భార్యతో కలిసి పెళ్లిబట్టలతో దిగిన ఫోటోలని సుబ్బరాజు సోషల్ మీడియా వేదికగా షేర్ చెయ్యడంతో పెళ్లి విషయం బయటకొచ్చింది.గతంలో చాలా ఇంటర్వూస్ లో పెళ్లి మీద ఆసక్తి లేదని సుబ్బరాజు చెప్పిన దరిమిలా మొదట అందరు ఆ పిక్స్ చూసి షాక్ అయ్యారు.ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. కానీ పెళ్లి కూతురు ఎవరనే విషయంలో సుబ్బరాజు చెప్పకపోయే సరికి పెళ్లి కూతురు విషయంలో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.ఈ క్రమంలో సుబ్బరాజు భార్య గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చాయి.
సుబ్బరాజు భార్య పేరు స్రవంతి(sravanthi)కొలంబియా యూనివర్సిటీ తో పాటు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బిడిఎస్, డిడిఎస్, ఎంపిహెచ్ డిగ్రీ పట్టా పొందిన ఆమె అమెరికా ఫ్లోరిడాలోని నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా పని చేస్తుంది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన స్రవంతి కి సైన్స్ పట్ల విపరీతమైన ఇష్టమట. చాలా ఏళ్ళ క్రితమే స్రవంతి ఫ్యామిలి అమెరికాలోని ఫ్లోరిడా లో స్థిరపడింది. కాకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక ప్రేమ పెళ్లా అనే విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే హైదరాబాద్ లో రిసిప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళందర్నీ ఈ వేడుకకు పిలబోతున్నారని సమాచారం.
![]() |
![]() |