![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)స్టార్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)మధ్య మంచి సోదరభావం ఉన్న విషయం అందరకి తెలిసిందే. అల్లు అర్జున్ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో వచ్చిన గీత గోవిందంతో పాటు,అల్లు అర్జున్ మరో సొంత ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ నిర్మించిన టాక్సీవాలా లోను విజయ్ హీరోగా నటించాడు. ఆ రెండు చిత్రాలు కూడా విజయ్ కెరీర్ కి మంచి హెల్ప్ అయ్యాయని కూడా చెప్పవచ్చు.విజయ్ నటించిన కొన్ని సినిమాలకి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసి తన అభినందనలు కూడా తెలియ చేసిన సందర్భాలు ఉన్నాయి.ఆ అనుబంధంతో ఒకరికొకరు తమ సినిమాల రిలీజ్ టైం లో గిఫ్ట్ లు పంపించుకుంటారు. విజయ్ అయితే తన రౌడీ బ్రాండ్ కలెక్షన్స్ నుంచి బన్నీ కి పంపించే టీ షర్ట్స్ చాలా వెరైటీ గా ఉంటాయి.
ఇప్పుడు ఈ కోవలోనే బన్నీ కి విజయ్ ఒక వినుత్నమైన డిజైన్ తో కూడిన టీషర్ట్ ని పంపించాడు. టీ షర్ట్ వెనుక పుష్ప పేరుతో రాసి ఉండగా బన్నీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అల్లు అర్జున్ 'మై స్వీట్ బ్రదర్ నీ ప్రేమకు కృతజ్ఞతలని పేర్కొన్నాడు. అందుకు బదులుగా 'లవ్ యు అన్నా నీ ప్రేమకు కృతజ్నతలని విజయ్ రిప్లై ఇచ్చాడు.ఇప్పుడు ఈ ట్వీట్స్ ఇరువురి అభిమానుల్లో జోష్ ని తీసుకొస్తుంది.

ఇక పుష్ప 2 రిలీజ్ కి తక్కువ వ్యవధి ఉండటంతో అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. వరుసగా పాట్నా, చెన్నై,కొచ్చి లో జరిగిన ఈవెంట్స్ లో పాల్గొన్న బన్నీ ఈ రోజు ముంబై లో జరిగే ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు.ఇక విజయ్ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |