![]() |
![]() |
.webp)
'దసరా,హాయ్ నాన్న,సరిపోదాశనివారం వంటి వరుస హిట్లతో నాచురల్ స్టార్ నాని(nani)హ్యాట్రిక్ ని అందుకున్న విషయం తెలిసిందే.పైగా ఆ మూడు చిత్రాలు నాని కెరీర్లోనే ఒకదాన్ని మించి ఒకటి రికార్డు కలెక్షన్స్ ని సాధించాయి.దీంతో ఇప్పుడు నాని సినిమాల మీద ఆయన అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హిట్ 3 మూవీని స్టార్ట్ చేసిన నాని 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(srikanth odela)తో 'ప్యారడైజ్'(paradise)అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో కూడిన సినిమాని కూడా ప్రారంభించాడు.
ఇప్పుడు ఈ మూవీలో ఒకప్పటి అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ(ramyakrishna)నటించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నాని తల్లి క్యారక్టర్ లో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని, అలాగే ఆ క్యారక్టర్ సినిమాకి హైలెట్ గా నిలబోతుందని కూడా అంటున్నారు. మరి ఈ విషయం మీద మేకర్స్ నుంచి అయితే ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
కాకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో వస్తుండంతో నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నాని, రమ్యకృష్ణ లు కలిసి వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. పైగా నాని కెరీర్ లో ఇప్పటి వరకు అగ్ర హీరోయిన్ రేంజ్ ఉన్న నటి హీరోయిన్ గా చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.ఎస్ ఎల్ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
.webp)
![]() |
![]() |