![]() |
![]() |

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి సిరీస్ బ్లాక్‌బస్టర్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు చేరవేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఆ రేంజ్ సినిమాలే చేస్తున్నారు. బాహుబలి2 తర్వాత మూడో పార్ట్ కూడా ఉంటుందా అని రాజమౌళిని, రచయిత విజయేంద్రప్రసాద్‌ని ఎన్నోసార్లు అడిగింది మీడియా. అయితే అది ఉందనిగానీ, లేదనిగానీ వారు చెప్పలేదు. ప్రస్తుతం మహేష్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు రాజమౌళి. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. బాహుబలి3 మరోసారి తెరపైకి వచ్చింది. తప్పనిసరిగా మూడో పార్ట్ ఉంటుందని ఓ నిర్మాత స్పష్టం చేస్తున్నారు. అయితే బాహుబలికి, అతనికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరంటే.. కె.ఇ.జ్ఞానవేల్‌రాజా. సూర్య, శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కంగువా’ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఎలా ఉంటుందో, ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో, కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలీదుగానీ జ్ఞానవేల్ మాత్రం ఏకంగా బాహుబలి2 రికార్డ్‌కే కంగువా చెక్ పెడుతుందని చెప్పారు. పైగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఛాలెంజ్ చేశారు. ఇక బాహుబలి3 విషయానికి వస్తే.. ఒక క్యారెక్టర్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే ఎన్ని భాగాలైనా తియ్యొచ్చు అంటున్నారు. అయితే గ్యాప్ తీసుకొని చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుందంటున్నారు. అసలు బాహుబలి 3 తియ్యాలన్న ఆలోచన రాజమౌళికి ఉందా అనేది సందేహమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీలో ఇప్పట్లో అలాంటి ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పే అవకాశమే లేదు. కాబట్టి జాన్ఞవేల్ చెప్పిన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
![]() |
![]() |