Home

»

Latest News

ప్రభాస్, విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ ఒకే సినిమాలో చేస్తున్నారా!

Oct 17, 2024 9:26AM

ప్రభాస్(prabhas)అప్ కమింగ్ ప్రాజక్ట్స్ లో స్పిరిట్(spirit)కూడా ఒకటి. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga)దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ  మూవీ మీద ఇప్పట్నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ప్రభాస్ ప్రస్తుతం మారుతీ(maruthi)దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న  ఫౌజీ షూటింగ్ కి కూడా రెడీ అయ్యాడు.ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారకంగా  ప్రారంభమయ్యింది.

 ఈ రెండు మూవీస్ ని కంప్లీట్ చేశాకే  ప్రభాస్  స్పిరిట్ ని స్టార్ట్ చెయ్యబోతున్నాడు. సందీప్ రెడ్డి  స్పిరిట్ ని ప్రభాస్ కెరీర్లోనే ఒక డిఫరెంట్ మూవీ గా నిలిచిపోయేలా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నాడని, ఒక క్యారక్టర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ  స్పిరిట్ లో కనిపించబోతున్నారనే  టాక్ వినిపిస్తుంది. ఇంకో బడా హీరో కూడా ఇందులో విలన్ గా చెయ్యబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

రణబీర్(ranbir kapoor)విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో సందీప్ రెడ్డి కి మంచి అనుబంధం ఉంది.సందీప్ దర్శకత్వంలో వచ్చిన యానిమల్,అర్జున్ రెడ్డి ఆ ఇద్దరి కెరీర్ లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో స్పిరిట్ లో ఆ ఇద్దరు చెయ్యడం ఖాయమైతే కనుక ఎలాంటి రోల్ లో ఆ ఇద్దరు కనిపిస్తారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.సందీప్ అయితే మాత్రం స్పిరిట్ కి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com