Home

»

Latest News

నూటయాబై మంది సరిపోరేమో..నాది మాత్రం ఇరవై ఒకటి 

Sep 14, 2024 5:17PM

బింబిసార(bimbisara)లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్(kalyan ram)నుండి వచ్చిన అమిగోస్, డెవిల్ లాంటి చిత్రాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో తన నూతన చిత్రాన్ని కొన్ని రోజుల క్రితం ప్రారంభించాడు.షూటింగ్ దశలో ఉన్న ఆ మూవీ ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరణ జరుపుకుంటుంది. అందుకు సంబంధించిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇండియన్ టాప్ ఫైట్ మాస్టర్స్ లో ఒకడైన పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో కళ్యాణ్ రామ్ తో పాటు  150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు షూట్‌లో పాల్గొంటుండగా ఒక యాక్షన్ బ్లాక్‌ రూపొందుతుంది.ఈ ఫైట్ సీక్వెన్స్ మూవీకి మేజర్ హైలైట్‌గా నిలబోతుందని చెప్పడంతో పాటుగా షూట్ లో  పీటర్  హెయిన్స్ సజిషన్ ఇస్తున్న లుక్ ఒకదాన్ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ  యాక్షన్ ఎపిసోడ్ పదిహేను రోజుల పాటు కొనసాగబోతుంది. అలాగే వీలైనంత త్వరగా షూటింగ్ ని కంప్లీట్ చేసే యోచనలో కూడా  మేకర్స్ ఉన్నారు.  

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(vijaysanthi)ఐపీఎస్ ఆఫీసర్ గా చేస్తుండగా  కళ్యాణ్ రామ్ కి జోడిగా సాయి మంజ్రేకర్ ఆడిపాడనుంది.     శ్రీకాంత్, సోహైల్ ఖాన్,తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.ప్రదీప్ చిలుకూరి(pradeep chilukuri)దర్శకుడు కాగా ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్(ntr arts)భారీ ఎత్తున నిర్మిస్తుంది.ఇది కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న ఇరవై ఒకటవ చిత్రం.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com