![]() |
![]() |

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద అమితాబ్ బచ్చన్(amitabh bachchan)కట్ అవుట్ కి ఉన్న స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.1971 లో రాజేష్ కన్నా హీరోగా వచ్చిన ఆనంద్ లో సపోర్టింగ్ క్యారక్టర్ తో మొదలయిన అమితాబ్ సినీ ప్రస్థానం ఇండియన్ సినిమాని శాసించే స్థాయికి ఎదిగింది. అంతటి కీర్తిని గడించిన అమితాబ్ పేరు మీద ఇప్పుడు సరికొత్త చర్చ జరగడం పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.
అమితాబ్ బచ్చన్ సతీమణి పేరు జయాబచ్చన్(jaya bachchan)హీరోయిన్ గా అమితాబ్ తో కలిసి చాలా చిత్రాలు చేసింది.ప్రస్తుతం సమాజ్ వాది పార్టీ తరుపున రాజ్యసభ ఏంపీ గా ఉంది.కొన్ని రోజుల క్రితం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, జయాబచ్చన్ ని ఉద్దేశించి జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించాడు. ఈ మాటపై జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నన్ను జయా బచ్చన్ అంటే సరిపోతుంది. మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా అంటూ మండి పడింది. దాంతో రికార్డుల్లో మీ పూర్తి పేరు అలాగే ఉందని హరివంశ్ రాయ్ బదులిచ్చాడు.

ఇప్పుడు ఈ విషయం మీద ప్రముఖ హీరోయిన్ బీజెపీ ఎంపీ కంగనా రనౌత్(kangana ranaut)తన దైన స్టైల్లో స్పందించింది. పేరు వివాదం పై జయా బచ్చన్ స్పందిచిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విధమైన అహంకారం ఉంటే కుటుంబసభ్యుల మధ్య ఉండే బంధంలోను ఇబ్బందులు ఎదురవుతుంటాయి.మనుషులెప్పుడు ఒకరికొకరు కలిసి ఉండాలి.మన పేరు వెనుక మరో వ్యక్తి పేరు వచ్చి చేరినందుకే కొంత మంది కోపానికి గురవుతున్నారు. తీవ్ర భయాందోళనలకి లోనవుతు తమ గుర్తింపు పోతుందని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు నాకు బాధగా ఉంటుందని చెప్పడమే కాకుండా స్త్రీ పురుషులు కలిసినపుడే జీవితం అందంగా ఉంటుంది.ప్రకృతి చాలా అందంగా ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని సృష్టించింది.దానిని వివక్ష గా చూడకూడదని కూడా సూచించింది.
![]() |
![]() |