![]() |
![]() |

ఇండియాలోని ఈ తరం గొప్ప నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రిషబ్ శెట్టి (Rishab Shetty) పేర్లు కూడా ఉంటాయి. అలాంటిది ఈ ఇద్దరు గొప్ప నటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది?. త్వరలోనే అది సాధ్యమైనా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.
ఎన్టీఆర్-రిషబ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో పాటు, రిషబ్ ను కూడా కలుస్తుంటాడు. రీసెంట్ గా ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠంకు ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ వెళ్లగా.. రిషబ్ మంగళూరు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. దగ్గరుండి టెంపుల్ కి తీసుకెళ్లాడు. ఇలా ఎన్టీఆర్-రిషబ్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు ఇద్దరు ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.
అదేంటంటే రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందుతోన్న 'కాంతార-2'లో ఎన్టీఆర్ ఒక కీ రోల్ లో మెరవనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా కన్నడ మీడియా ఎన్టీఆర్ ను అడగగా.. ఒకవేళ రిషబ్ అలాంటిదేమైనా ప్లాన్ చేస్తే, తాను నటించడానికి రెడీగా ఉన్నానని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు.
దీనితో పాటు మరో ప్రచారం కూడా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా రిషబ్ శెట్టి నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజమైనా స్క్రీన్ లు షేక్ అవుతాయి అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |