![]() |
![]() |
.webp)
ఓవర్ సీస్ లో నాచురల్ స్టార్ నాని(nani)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలు అక్కడ రికార్డు కల్లెక్షన్స్ ని సృష్టించాయి. మరి ఇప్పటికే నాని నయా మూవీ సరిపోదా శనివారం(saripodasanivaram)షోస్ ఓవర్ సీస్ లో పడ్డాయి. మరి ప్రేక్షకుల మౌత్ టాక్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా కంప్లీట్ ఫుల్ ఫ్లెగ్జడ్ మాస్ మూవీ. ఒక సరికొత్త నాని ని చూశామనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.క్లాస్ గా కనపడుతూనే మాస్ పెర్ఫార్మెన్స్ ని నాని సరికొత్తగా ప్రెజెంట్ చేసాడని, ఎంటైర్ నాని కెరీర్ లోనే ఒక డిఫరెంట్ మూవీగా నిలబడం ఖాయమని కూడా అంటున్నారు. అలాగే ఎస్ జె సూర్య, నాని ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉండటంతో పాటు ప్రియాంక మోహన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించిందని, మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్ర మేరకు చక్కని అభినయాన్ని ప్రదర్శించారనే మాటలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అదే విధంగా ఎంటర్టైన్మెంట్ కి కూడా ఎలాంటి లోటు లేదు. ఆర్ఆర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. టోటల్ గా మూవీ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడం ఖాయమని కూడా అంటున్నారు. నిర్మాత ఆర్ఆర్ఆర్ దానయ్య(danayya)దర్శకుడు వివేక్ ఆత్రేయ(vivek athreya)ల పని తీరు కూడా సరిపోదా శనివారం ని హిట్ ట్రాక్ లో పయనించేలా చేసిందనే టాక్ కూడా వస్తుంది. మరి మన రివ్యూ వస్తే గాని అసలు విషయం తెలియదు.
![]() |
![]() |