![]() |
![]() |
రాజావారు రాణిగారు చిత్రంలో జంటగా నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడడం, త్వరలోనే తాము వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని ప్రకటించడం జరిగింది. తాజాగా కర్ణాటకలోని కూర్గ్‌లో కిరణ్, రహస్యల వివాహం వైభవంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సినిమా రంగం నుంచి ఎవరూ హాజరైనట్టు కనిపించలేదు. తర్వాత హైదరాబాద్‌లో ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ జరుపుతారని తెలుస్తోంది.

![]() |
![]() |