Home

»

Latest News

ఎన్టీఆర్ సెక్షన్ సూపర్... శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Aug 22, 2024 2:57PM


మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్ తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్... వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్  గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... ‘మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా వుంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న.ఎన్టీఆర్ ఎంతో మెచ్చి... ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ ఖాతాలోఆయ్ , మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com