![]() |
![]() |
సెప్టెంబర్ 2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు. ఈ ఏడాది పవర్‌స్టార్ పుట్టినరోజు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్‌కళ్యాణ్ పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చెయ్యాల్సి ఉంది. ఈ పుట్టినరోజుకు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాత డి.వి.వి.దానయ్య ఆ గుడ్ న్యూస్ చెప్పేసారు.
త్వరలోనే ‘ఒజి’ టీజర్ రిలీజ్ ఉంటుందని దానయ్య ప్రకటించారు. పవన్ బర్త్‌డేకి ఓజీకి సంబంధించిన లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతుందనే వార్త నిన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. టీజర్ రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పడం ఒక రకంగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్తే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతు ఓజీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని, షూటింగ్‌ని కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు దానయ్య. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ షూటింగ్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పూర్తవుతుంది, సినిమా రిలీజ్ డేట్ ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియలేదు. అయితే ఓజి, హరిహర వీరమల్లు సినిమాలకు పవన్ డేట్స్ ఇచ్చారని మాత్రం తెలుస్తోంది.
![]() |
![]() |