![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ(ravi teja)మిస్టర్ బచ్చన్(mr bachchan)అంటూ ఇండిపెండెన్స్ కానుకగా అగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం వంటి హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్(harish shankar)కాంబో కావడంతో రవి తేజ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మీద నమ్మకంతో ముందు రోజు చాలా ఏరియాల్లో ప్రివ్యూలు కూడా పడ్డాయి. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ ని అందుకుంది.అంతే కాకుండా కొన్ని సీన్స్ మీద ట్రోలింగ్ కూడా నడిచింది. నడుస్తూనే ఉంది కూడా. ఇప్పుడు వీటన్నిటిపై హరీష్ ఒక రేంజ్ లో మండిపడుతున్నాడు .
హరీష్ తాజాగా మీడియాతో మాట్లాడుతు మిస్టర్ బచ్చన్ లో ఉన్న మంచిని పక్కన పెట్టి కేవలం ఒక్క పాయింట్ ఆధారంగా విమర్శ చేసే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు. అదే విధంగా సోషల్ మీడియానే నాకు జీవితం కాదు. గబ్బర్ సింగ్ లోని డైలాగ్ లా నేను ఆకాశం లాంటి వాడిని ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఒకేలా ఉంటా. నా వ్యకిత్వం కూడా అదే అని చెప్పుకొచ్చాడు. అలాగే మరికొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసాడు.
.webp)
గతంలో రవితేజ కి చెందిన సినిమాల రిజల్ట్ నన్ను నిరాశపరిచాయి. కానీ ఆ సినిమాల దర్శకుల విషయంలో జరగని దాడి ఇప్పుడు నాపై జరుగుతుంది. ఉద్దేశ్యపరంగానే నన్నుకొందరు టార్గెట్ చేస్తున్నారు.ఒక డాన్స్ మూమెంట్ ని ప్రధానంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.కానీ మూవీలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి.కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్టు లెక్క అని రాసాను. ఆ డైలాగ్ బాగా నచ్చిందని చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. అలాగే హీరో ఒక సందర్భంలో హీరోయిన్ తో నా ప్రేమ నీకు అర్ధమయ్యే వరకు నిన్ను కదిలించనని అంటాడు. ఆడవాళ్ళ మనోభావాల్ని మగవాడు గౌరవించాల్సిందే అనేలా ఆ డైలాగ్ ని రాసాను.ట్రోల్ల్స్ చేసే వాళ్ళకి ఈ మంచి కనపడదు.అందుకే నోటికి సౌలభ్యం గా ఉన్న వాటిని తీసుకొని విమర్శించే వాళ్ళని పట్టించుకోనని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.రవితేజ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే( bhagyashri borse)జత కట్టింది.
![]() |
![]() |