![]() |
![]() |

అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య గత కొంతకాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు జరిగిన ఓ సంఘటనను తీసుకొని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ పెట్టడం, దానికి బన్నీ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. బన్నీకి సంబంధించిన ఏ విషయం దొరికినా దాన్ని ఛాన్స్‌గా తీసుకుంటున్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. బన్నీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే దానికి కారణం.
అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా స్కూటీపై ఓ వ్యక్తి బన్నీని చూసినా చాలా నార్మల్‌గా వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. ఒక పాన్ ఇండియా హీరోని పట్టించుకోనట్టు ఆ స్కూటీ అతను వెళ్లిపోయాడు. అలాగే ఓ వృద్ధుడు బన్నీకి ఎదురుపడినా ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వలేదు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌కి అవకాశంగా దొరికింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
‘బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఇదీ.. ఆన్‌లైన్‌లో తప్ప ఆఫ్‌లైన్‌లో పట్టించుకునేవారు లేరు. పాన్ ఇండియా హీరోకి ఉన్న క్రేజ్ ఇదన్నమాట..’ అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులపై బన్నీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ‘క్యారవాన్, బౌన్సర్లు లేకుండా ఇంత సింపుల్‌గా ఉండే హీరో ఎవరైనా ఉన్నారా’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బన్నీ ‘పుష్ప2’ చిత్రంతో తన క్రేజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా ఫ్యాన్స్.. బన్నీని ఇలా ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాల ఫ్యాన్స్ తమ పోస్టులతో యుద్ధం మొదలుపెట్టారు.
![]() |
![]() |