![]() |
![]() |
.webp)
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ప్రస్తుతం రెండు భారీ సినిమాలలో నటిస్తోంది. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' కాగా, రెండోది ప్రభాస్ 'రాజా సాబ్'. ఈరోజు(ఆగస్టు 17) పుట్టినరోజు సందర్భంగా 'హరి హర వీరమల్లు' నుంచి ఇప్పటికే నిధి ప్రత్యేక పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు 'రాజా సాబ్' వంతు వచ్చింది.
ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా సాబ్' (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిధి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. అంతేకాదు సెట్స్ ఆమె బర్త్ డే ని సెలెబ్రేట్ చేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ లో నిధి లుక్ క్యూట్ గా ఉంది. బిగ్ స్క్రీన్ పై ప్రభాస్-నిధి జోడి మేజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది.

థమన్ సంగీతం అందిస్తున్న 'రాజా సాబ్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2025, ఏప్రిల్ 10న విడుదల కానుంది.
![]() |
![]() |