![]() |
![]() |

కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush) నటించిన 50వ చిత్రం 'రాయన్' (Raayan). దీనికి ధనుషే దర్శకుడు కావడం విశేషం. మంచి అంచనాలతో జూలై 26న థియేటర్లలో అడుగుపెట్టిన రాయన్.. పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడమే కానుందా, మంచి వసూళ్లతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'రాయన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రైమ్ ప్రకటించింది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించిన రాయన్ లో సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, కాళిదాస్ జయరాం, దుషరా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
![]() |
![]() |