![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)నట వారసులుగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్(pawan kalyan)రామ్ చరణ్(ram charan)ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అందరకి తెలిసిన విషయమే. తమ పవర్ ఫుల్ నటనతో మెగా అభిమానులే తమకి ఉంటారనే టాగ్ లైన్ ని ధాటి సొంతంగా కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు. పవన్ అయితే ఏకంగా డిప్యూటీ సిఎంతో పాటు మంత్రి కూడా అయ్యాడు. ఇప్పడు ఆ ఇద్దరి అభిమానులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఎస్ . సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్తతో పవన్, చరణ్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు బీజం వేసిన వారు ఇద్దరు దర్శకులు. వాళ్లెవరో కాదు సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో హిట్ చిత్రాలని అందించిన శంకర్(shankar)అండ్ హరీష్ శంకర్(harish shankar)ఈ ఇద్దరు పవన్, చరణ్ అప్ కమింగ్ మూవీస్ గేమ్ చేంజర్(game changer)ఉస్తాద్ భగత్ సింగ్(ustad bhagat singh)లకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు నుంచి లేటెస్ట్ గా భారతీయుడు 2 , మిస్టర్ బచ్చన్ లు వచ్చాయి. రెండు కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కూడా డైరెక్షన్ ఫాల్ట్ అనేది ఉండదు. కానీ ఆ రెండు చిత్రాల ప్లాప్ లు దర్శకుడి ఖాతాలోకే వెళ్లాయి. ఓల్డ్ నేరేషన్ లో స్క్రీన్ ప్లే ఉండి ప్రేక్షకులకి విసుగిని తెప్పించాయి.అసలు సినిమా ఎటు వైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి.
ఇక గేమ్ చేంజర్, ఉస్తాద్ లు పవన్ అండ్ చరణ్ కెరీర్ కి చాలా ఇంపార్టెన్స్. ఆ ఇద్దరి నుంచి సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. దీంతో అభిమానులు ఆ రెండు సినిమాల మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలాంటిది భారతీయుడు 2 , మిస్టర్ బచ్చన్ లు ప్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ లో దడ మొదలయ్యింది. ప్రస్థుతానికి పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఉస్తాద్ షూటింగ్ అయితే జరగడం లేదు. ఇక గేమ్ చేంజర్ అయితే ఎంత వరకు వచ్చిందో తెలియటం లేదు.కొన్ని రోజుల క్రితం వరుస అప్ డేట్స్ వచ్చాయి. కానీ ఈ మధ్య కాలం నుంచి రావడం లేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే శంకర్, హరీష్ శంకర్ కి గేమ్ చేంజర్, ఉస్తాద్ లు హిట్ అవ్వడం చాలా ముఖ్యం. లేకపోతే ఆ ఇద్దరి సినీ కెరీర్ లో అనిచ్చితి ఆవహించే అవకాశం ఉంది.
![]() |
![]() |