![]() |
![]() |
.webp)
తెలుగులో ప్రతీవారం కొన్ని వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. అందులోను ఫ్యామిలీతో కలిసి చూసే కథల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. వారి కోసం ఓ కొత్త వెబ్ సిరీస్ వచ్చేస్తుంది. బహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సత్యరాజ్ నటించిన ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ' మై పర్ ఫెక్ట్ హస్బెండ్ '. ఈ సిరీస్ లో వర్ష బొల్లమ్మ కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ కి తమిర దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సిరీస్ తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. దీనిని మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే.. ఓ కాలేజీలో ప్రొఫెసర్ గా సత్యరాజ్ కన్పిస్తుండగా.. అతని భార్య పాత్రలో రేఖ నటించింది. ఇక తాజాగా ఈ సిరీస్ లో భార్యాభర్తల మధ్య బాండింగ్ ని , వారి చుట్టూ సాగే కథలా మనకి తెలుస్తుంది. ఫ్యామిలీ డ్రామాగా సాగే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అగస్ట్ 16 న స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే రెండు భిన్నమైన ప్రేమకథలని ఒకే కథలో చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మై పర్ ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ తమిళంలో రూపొందించారు. ఇది తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇది తెలియజేస్తూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది.
![]() |
![]() |