![]() |
![]() |

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇవి తప్పుడు ఆరోపణలు అని, తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తానని అంటున్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ డ్రగ్స్ వివాదంపై స్పందించారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరుతున్నాను. అపాయింట్మెంట్ దొరికితే.. ఆయనను కలిసి, నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతాను. మీరు ఏ టెస్ట్ చేసుకుంటారో చేసుకోండి.. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. అలాగే మా కష్టసుఖాలు తెలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయమై కలిసి నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వమని కోరతాను. నేను డ్రగ్స్ తీసుకోలేదు. కొందరు మీడియా వారే నా మీద బురద చల్లారు." అని హేమ అన్నారు.
![]() |
![]() |