![]() |
![]() |

వేణు స్వామి (Venu Swamy)పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ వారు విడిపోతారంటూ చేసిన వీడియో పెను దుమారం లేపింది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ.. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లు తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నీరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశాయి.
ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా, జాతకాల పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితంపై పబ్లిక్ గా కామెంట్స్ చేస్తున్న వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని సామాన్యుల నుంచి సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

![]() |
![]() |