![]() |
![]() |

మీరేం చేస్తారో తెలియదు నాకు విశ్వక్ సేన్ కావాలి(vishwak sen) ఇప్పుడు ఈ మాటని తెలుగు చిత్ర సీమలో బడా ప్రొడ్యూసర్స్ గా పేరొందిన నిర్మాతలు తమ టీం తో చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను విశ్వక్ సేన్ డేట్స్ కావాలని ఖరాకండిగా చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.
విశ్వక్ ఇప్పుడు టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ తో పాటు నిర్మాతకి లాభాలని తెచ్చిపెట్టే హీరోగా కూడా పేరు సంపాదించాడు. ఇందుకు ఉదాహరణే తన గత చిత్రాలైన గామి(gaami)గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ రెండు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాతలకి ఒక మాదిరి లాభాలే తెచ్చిపెట్టాయి. అందుకే ఇప్పుడు నిర్మాతలందరూ వరుసపెట్టి విశ్వక్ సేన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే పక్కా మాస్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ 31 న థియేటర్స్ లో అడుగుపెట్టడానికి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇది గాక షైన్ స్క్రీన్ బ్యానర్ లో లైలా(laila)ని చెయ్యబోతున్నాడు. మొట్ట మొదటి సారిగా ఇందులో ఒక అమ్మాయి క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు.

ఆ రెండు గాక సుధాకర్ చెరుకూరి బ్యానర్ లో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని దసరా(dasara)రవితేజ రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలని నిర్మించాడు. అలాగే మరో క్రేజీ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా విశ్వక్ తో ఒక మూవీని నిర్మించబోతోంది. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకుడు. దీంతో ఈ మూవీకి చెందిన మరిన్ని అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు రీగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో విశ్వక్ చాలా బిజీ గా ఉన్నాడు. పైగా అవన్నీ కూడా అగ్ర నిర్మాతలు నిర్మించేవే. మరింత మంది నిర్మాతలు కూడా విశ్వక్ డేట్స్ కోసం రెడీ గా ఉన్నారని సమాచారం.
![]() |
![]() |