![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'కంగువ' (Kanguva) సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. (Kanguva Trailer)
'కంగువ' ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. గెటప్స్, లొకేషన్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ఇక యాక్షన్ సన్నివేశాలైతే వేరే లెవెల్ లో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. సూర్య, బాబీ డియోల్ పోటాపోటీగా విజృంభించారు. పక్కా కమర్షియల్ సినిమాల డైరెక్టర్ గా పేరున్న శివ.. ఈ సినిమాతో అందరిని సర్ ప్రైజ్ చేయడం ఖాయమనిపిస్తోంది.
'కంగువ' అనేది టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ కథ 1670 ప్రాంతంలో, అలాగే వర్తమానంలో జరగనుందట. 1670లలో క్రూరమైన ట్రైబల్ వారియర్ గా కనిపించనున్న సూర్య.. టైం ట్రావెల్ చేసి ప్రజెంట్ లోకి వస్తాడని వినికిడి. అయితే ట్రైలర్ ను మాత్రం కంప్లీట్ పీరియాడిక్ ఫిల్మ్ అనే భావన కలిగించేలా రూపొందించారు. కానీ గతంలోనే ట్రెండీ లుక్ లో కనిపించే సూర్య సెకండ్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. కాబట్టి ట్రైలర్ లో చూపించనప్పటికీ ఇది రెండు వేరు వేరు కాలాలలో జరిగే కథ అని అర్థమవుతోంది.
'కంగువ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిసామి, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |