![]() |
![]() |

రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెట్స్ కోసం రైస్ అవసరం అని నెలకు మూడు వందల కేజీల రైస్ అవుతోందని, ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలంటూ ఒక పోస్ట్ పెట్టింది. తాను 50 కేజీల రైస్ ఇచ్చేశానని, మిగిలింది అందరూ కలిసి ఎంతో కొంత సాయం చేయాలనీ కోరింది. ఐతే అడివి శేష్ పదిహేను వేలు పంపించాడట. ఒక కుక్క పిల్ల ట్రీట్మెంట్ కోసం వెంటనే స్పందించి సాయం చేసిన అడివి శేష్‌ను రేణూ దేశాయ్ పొగుడుతూ పోస్ట్ పెట్టింది. అడివి శేష్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే అని ఆకాశానికెత్తేసింది.

అడివి శేష్ అంటే పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ కూడా. దాంతో అడివి శేష్ పవన్ కళ్యాణ్ పుత్రరత్నం అకిరాతో ఎంతో క్లోజ్‌గా ఉంటాడు. అడివి శేష్, అకిరా కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. రేణూ దేశాయ్ ఫ్యామిలీతో అడివి శేష్ కి మంచి బాండింగ్ ఉంది. అడివి శేష్ అకిరాకు అన్న లాంటి వాడు అంటూ రేణూ దేశాయ్ చెబుతుంటుంది. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఐతే అభిమానులు మాత్రం అకీరా ఎంట్రీ ఎప్పుడూ అని రేణు దేశాయ్ ని అడుగుతూనే ఉన్నారు. తనకు నచ్చినప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్తాను అన్నప్పుడు తానే చెప్తానంటోంది రేణు దేశాయ్.
![]() |
![]() |