![]() |
![]() |

స్టార్ హీరో సూర్య(suriya)ఇటీవల తన కొత్త సినిమా షూటింగ్ లో గాయాలు పాలవ్వడంతో అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే ప్రకటన వచ్చినా కూడా అభిమానులతో పాటు శ్రేయాభిలాషులు కూడా ఇప్పటికి సూర్య సన్నిహిత వర్గాల వారికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సూర్య తన అభిమానుల కోసం ఒక తీపి వార్తని ప్రకటించాడు.
సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా(kanuguva)ప్రచార చిత్రాలు ,సూర్య లుక్ అదిరిపోవడంతో ఇప్పుడు సూర్య కంగువ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసే కార్తీక్ సుబ్బరాజ్(karthik subbaraj)మూవీలో చేస్తున్నాడు. అందులోనే గాయాలపాలయ్యాడు. ఇక అసలు విషయంలోకి వస్తే కంగువా ట్రైలర్ అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. అదేంటి మూవీ అక్టోబర్ 10 కదా రిలీజ్. దీన్ని బట్టి ఒక ఇరవై రోజుల ముందో, నెల ముందో ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా అని అనుకుంటున్నారా! కానీ సూర్య తన అభిమానుల కోసం రెండు నెల ముందుగానే రిలీజ్ చేస్తున్నాడు. ఆగస్ట్ 12న ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు ఒక పవర్ ఫుల్ పోస్టర్ తో మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. సూర్య స్టిల్ అయితే సూపర్ గా ఉంది.

కంగువా సూర్య కెరీర్ లోనే కాకుండా టోటల్ తమిళ సినిమా రంగం నుంచే వస్తున్న బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీ. బాలీవుడ్ నటి దిశా పటాని(disa patani)హీరోయిన్ గా చేస్తుండగా కంగువా మెయిన్ క్యాస్ట్ మొత్తం ట్రైలర్ తో తెలిసిపోతుంది.రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తుండగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.ఎన్నో హిట్ చిత్రాలని అందించిన శివ దర్శకుడు.
![]() |
![]() |