![]() |
![]() |

'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వెల్ గా హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart). పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి, ఛార్మి నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడిన వేళ, ఈ మూవీ వాయిదా పడిందనే వార్త షాకింగ్ గా మారింది.
పూరి గత చిత్రం 'లైగర్' బయ్యర్లకు నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'పై పడుతోంది. లైగర్ నష్టాలను భర్తీ చేయకుంటే, నైజాంలో విడుదలకు అడ్డంకులు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే 'డబుల్ ఇస్మార్ట్' పోస్ట్ పోన్ అయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మూవీ టీం మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. వాయిదా వార్తల్లో వాస్తవం లేదని, సినిమా ఖచ్చితంగా ఆగష్టు 15 నే విడుదలవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆగష్టు 11న హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

![]() |
![]() |