![]() |
![]() |

కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసే ఎన్టీఆర్.. ఈమధ్య బాగా వేగం తగ్గించాడు. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి రెండే రెండు సినిమాలు వచ్చాయి. 2018లో 'అరవింద సమేత' విడుదల కాగా, 2022లో 'ఆర్ఆర్ఆర్' విడుదలైంది. ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ తన ప్రైమ్ టైంలో ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. అయితే వారి నిరాశని పోగొట్టేలా, గ్యాప్ ని భర్తీ చేసేలా.. ఎన్టీఆర్ జోరు పెంచాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటినుంచి ఏడాదికి కనీసం ఒక సినిమాని విడుదల చేసేలా చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'దేవర' ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న మూవీ తాజాగా లాంచ్ అయింది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే 2024, 2025, 2026 ఇలా ప్రతి ఏడాది ఎన్టీఆర్ నుంచి సినిమా రానుంది. వీటితో పాటు 'దేవర-2' కూడా విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |