![]() |
![]() |

కేరళలోని వయనాడ్ (Wayanad)లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా వయనాడు బాధితుల సహాయార్థం సీఎం రిలీప్ ఫండ్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం కేరళ వెళ్లిన చిరంజీవి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.
చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు ప్రభాస్, అల్లు అర్జున్, రష్మిక మందన్న, సూర్య, నయనతార ఇలా ఎందరో సినీ సెలబ్రిటీలు వయనాడు బాధితులకు విరాళం ప్రకటించారు.
![]() |
![]() |