![]() |
![]() |

ఎనీ లాంగ్వేజ్ సిల్వర్ స్క్రీన్ ని తీసుకోండి. ఆన్ ది స్క్రీన్ హీరో పవర్ ఫుల్ గా ఉంటాడు. హీరోయిన్ ఏమో హీరో వెనకాలే అణిగిమణిగి ఉంటుంది. నూటికి తొంబై తొమ్మిది సినిమాల తీరు అదే విధంగా ఉంటుంది. కానీ ఆన్ ది స్క్రీన్ ,ఆఫ్ ది స్క్రీన్ రెండిటిలోను పవర్ ఫుల్ గా ఉండే హీరోయిన్ కంగనా రనౌత్(kangana ranaut)ఇది నిజమని చెప్పడానికి కంగనా సినీ, పొలిటికల్ లైఫ్ నే ఒక ఉదాహరణ. తాజాగా ఆమె గురించి వస్తున్న ఒక న్యూస్ ఆమె అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కంగనా ప్రెజంట్ ఎమర్జన్సీ(emergency)అనే మూవీ చేస్తుంది. మన దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(indira gandhi)క్యారక్టర్ ని కంగనా పోషిస్తుంది. సెప్టెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ కూడా శరవేగంగానే జరుగుతుంది. ఇక రీసెంట్ గా కంగనా తన ఇంటిని అమ్మబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ముంబై లోని అత్యంత ఖరీదు ప్రాంతమైన బాంద్రా లో కంగనా కి సుమారు 40 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఈ ఇంటినే కంగనా అమ్మకానికి పెట్టిందనే మాటలు వినిపిస్తున్నాయి.
కంగనా ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యింది. తన స్వంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండీ పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మెజారిటీ తో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. దీంతో రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లోనే ఆమె ఎక్కువగా ఉండాల్సి వస్తోంది. అందుకే ముంబైలోని తన నివాసాన్ని వదులుకోవాలని భావించిందని అంటున్నారు. 2006 లో గ్యాంగ్ స్టార్ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు 40 కి పైగా చిత్రాల్లో చేసింది. 2009 లో ప్రభాస్ తో ఏక్ నిరంజన్ లో కూడా చేసింది.
![]() |
![]() |