![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ, రామ్ పోతినేని కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మల్టీస్టారర్ కి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాకి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నాడట.
మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇందులో ఓ సీనియర్ స్టార్ కూడా నటిస్తున్నాడని టాక్. ఆ సీనియర్ స్టార్ ఎవరో కాదు.. బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇది క్రేజీ కాంబో అవుతుంది.
గతంలో మరో సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలిసి 'మసాలా' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రామ్. ఇప్పుడు వరుస మాస్ సినిమాలు చేస్తున్న రామ్.. బాలయ్య లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోతో కలిసి నటిస్తే ప్రకటనతోనే అంచనాలు ఓ రేంజ్ కి వెళ్తాయి.
![]() |
![]() |